ఆంధ్రప్రదేశ్: మాజీ సీఎం జగన్‌పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం, తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్‌పై జగన్ స్పందించారు.
అసెంబ్లీ డిస్‌క్వాలిఫికేషన్ విషయమై జగన్ మాట్లాడుతూ, “తనను డిస్‌క్వాలిఫై చేసేందుకు ఎవరికీ అధికారం లేదు” అని ధీమా వ్యక్తం చేశారు. తాను రెడీగా ఉన్నానని, తమ పార్టీని డిస్‌క్వాలిఫై చేయాలంటే చేసుకోవచ్చని సవాల్ విసిరారు.
షర్మిల వ్యాఖ్యలపై వ్యక్తిగతంగా స్పందించవలసిన అవసరం లేదని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని, ఆ పార్టీ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతగా లేదని తేల్చిచెప్పారు. 1.17 శాతం ఓటు బ్యాంక్ ఉన్న కాంగ్రెస్‌పై ఎందుకు చర్చించాలో అర్థం కావడం లేదని అన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వానికి తనపై అప్పుల దుష్ప్రచారం చేశారని, అసెంబ్లీ బడ్జెట్ సాక్షిగా తాను తక్కువ అప్పులు చేశానని వివరించారు.
2019లో చంద్రబాబు వెళ్లేటప్పుడు రూ. 42,183 కోట్ల బకాయిలను తనపై వదిలేశారని, తాను ఆ బకాయిలను తీరుస్తూ ప్రభుత్వాన్ని నడుపుతున్నానని జగన్ తెలిపారు.