వైసీపీ అధినేత జగన్, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన వివాదాలు తీరిపోతున్నాయని వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బెంగళూరు పర్యటనలలో భాగంగా జగన్.. ఈ వివాదాన్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా, షర్మిల గత కొన్ని నెలలుగా తన వ్యవహార శైలిలో మార్పులు చేర్పులు చేశారు. కొద్ది రోజుల క్రితం వరకు జగన్, వైసీపీపై విమర్శలు చేసిన ఆమె.. ఇప్పుడు మౌనంగా ఉంటూ కూటమి సర్కారుపైనే విమర్శలు చేయడం గమనార్హం.
తనకున్న స్వేచ్ఛలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవచ్చు, కానీ ఈ పరిణామం ఆమె వ్యక్తిగత ఇమేజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా మారింది.
జగన్‌పై విమర్శలు చేసి వదిలేశారన్న ఆరోపణలు ప్రజల్లో ఆమోదం పొందాయి. ఇప్పుడు ఆస్తుల పంపకాల వివాదం సద్దుమనిగినట్లైతే, షర్మిల వ్యాఖ్యలు కేవలం ఆస్తుల కోసమేనని ముద్రవేయడానికి అవకాశం ఉంటుంది.
తెలంగాణలో వైఫల్యాన్ని ఎదుర్కొన్న ఆమె ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాత ప్రజలు ఆమెను విశ్వసించారు. కానీ, ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
YS Jagan, YS Sharmila, Political Settlement, Andhra Pradesh Politics, Property Dispute,