fbpx
Friday, November 8, 2024
HomeAndhra Pradeshప్రజా సమస్యలపై జగన్ కొత్త మార్గం

ప్రజా సమస్యలపై జగన్ కొత్త మార్గం

jagan-skips-assembly-prefers-media-alternative

ఏపీ: అసెంబ్లీని పక్కన పెట్టి మీడియా సమక్షంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలను చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నిస్తానని జగన్ ప్రకటించారు. తన వైఖరితో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండడంలో కొత్త తరహా రాజకీయ ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు.

జగన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వదిలి మీడియా ద్వారా ప్రజల సమస్యలు ప్రస్తావించడం సరికాదంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ రకమైన చర్యలు రాజకీయ ప్రాసెస్‌కు వ్యతిరేకమని, ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రతినిధులు సభలోనే ప్రజా సమస్యలను తీసుకురావాలని అంటున్నారు.

జగన్ మాట్లాడుతూ, టీడీపీ ఎక్స్ ఖాతా ఫేక్ పోస్టులతో నిండిపోతోందని, సొంత తల్లిని కూడా రాజకీయంగా అపకీర్తిపర్చేలా తయారయ్యారని ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు కూడా జగన్ విధానం పట్ల విమర్శలు విసురుతుండగా, అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కొనే విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular