తలైవా రజనీకాంత్ నటించిన ‘జైలర్’ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించింది. కేవలం రూ.12 కోట్ల బిజినెస్ చేసి, రూ.47 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో ‘జైలర్ 2’పై తెలుగు మార్కెట్‌లో భారీ హైప్ ఏర్పడింది.
ఇప్పుడు అయితే పరిస్థితి వేరేలా ఉంది. తాజా సమాచారం ప్రకారం ‘జైలర్ 2’ తెలుగు రైట్స్ కోసం ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకంగా రూ.60 కోట్ల బిడ్డింగ్ పెట్టిందట. ఇది గత భాగంతో పోలిస్తే మూడింతల ధర కావడం విశేషం. అయితే మేకర్స్ ఇంకా ఎక్కువ ఆఫర్ల కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.
అయితే అదే సమయంలో ‘జైలర్ 2’కి వార్ 2 నుంచి గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో తగిన హైప్ సంపాదించుకుంది. దీంతో జైలర్ 2కి గత సారీ లాగా పోటీ లేకుండా బెనిఫిట్ ఉండే ఛాన్స్ కనిపించట్లేదు.
ఈ పరిస్థితుల్లో రూ.60 కోట్ల డీల్ లాభమేనా? లేక ఓవర్ కాన్ఫిడెన్స్ లో తీసుకున్న నష్టం అయ్యే డీల్‌గా మిగిలిపోతుందా? అన్నది ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.