లండన్: అంతర్జాతీయ క్రికెట్ కు మరో దిగ్గజ క్రికెటర్ వీడ్కోలు పలికారు. వెస్టిండీస్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్ తో ఇంగ్లండ్ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు.
తన చివరి టెస్టులో తమ జట్టు విజయం సాధించి తనకు వీడ్కోలు పలికినట్లు అయింది. తన చివరి టెస్టులో ఆండర్సన్ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 4 వికెట్లు తీశాడు. ఆండర్సన్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతాడు.
తన పేస్, స్వింగ్ తో మేటి బ్యాట్స్ మెన్లను సైతం హడలెత్తించడంలో ఆండర్సన్ పెట్టింది పేరు. ఆండర్సన్ ఇప్పటికే వన్డేలు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆండర్సన్ ఇప్పటివరకు 188 టెస్టుల్లో 704 వికెట్లు తీశాడు.
కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో 700 వికెట్ల మైలురాయిని దాటిన ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ ఆండర్సన్. అలాగే టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఆండర్సన్ మూడవ స్థానంలో నిలిచాడు. తనకంటే ముంది షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ ఉన్నారు.
ఆండర్సన్ భారత్ తో 39 టెస్టుల్లో ఏకంగా 149 వికెట్లు తీసి, భారత్ పై తన ఆధిపత్యాన్ని చాటాడు. తన చివరి టెస్టుతో కలిపి 40 వేల బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.