హాలీవుడ్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ క్యారెక్టర్ గురించి ఆ సినిమా సిరీస్ ల గురించి తెలియని వారుండరు. ఇప్పుడు రకరకాల క్యారెక్టర్ లకి ఫ్రాంచైజ్ అని బ్రాండ్ వాల్యూ అని ఆ క్యారెక్టర్ కి ఒకరి తర్వాత ఒకరిని తీసుకుంటున్నారు. కానీ ఎప్పటినుంచో ఈ పద్ధతిని జేమ్స్ బాండ్ సిరీస్ వాల్లు ఫాలో అవుతున్నారు. ఫేమస్ డిటెక్టివ్ గా ఉండే ఈ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. 1960 ల్లో జేమ్స్ బాండ్ పాత్ర చేసిన ‘సీన్ కానరీ‘ కన్ను మూసారు. ఈయన వయసు 90 సంవత్సరాలు. 1962 నుండి జేమ్స్ బ్యాండ్ గా ఈయన ప్రయాణం మొదలైంది. ఏడు సినిమాల్లో ఈయన జేమ్స్ బాండ్ గా నటించాడు. బాండ్ సినిమాలతో పాటు ‘ది విండ్ అండ్ ది లైన్’, ‘ది రాక్’ , ‘ఇండియానా జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్’ వంటి సినిమాలతో సినీ అభిమానుల్ని అలరించాడు.
ఈయన బహమాస్ లోని తన స్వగృహంలో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. 2008 వ సంవత్సరంలో తన ఆటోబయోగ్రఫీ ‘బీయింగ్ ఎ స్కాట్’ ను ప్రచురించారు కానరీ. ఈయన దాదాపు 40 సంవత్సరాలు నటుడిగా కొనసాగాడు. సీన్ కానరీ ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే కాకుండా మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు కూడా సాధించాడు. ప్రస్తుతం ఈయన మృతి కి హాలీవుడ్ నుండి చాల మంది ప్రముఖులు నివాళులు తెలుపుతున్నారు.