మూవీడెస్క్: హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు పెట్టుకున్న ఆయన తుది తీర్పుకు వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ విడుదలైన రోజు తన పిల్లలు అయాన్, అర్హ ఆయనను హగ్ చేసుకుని చూపిన సంతోషం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
తన పిల్లల కోసమే బన్నీకి బెయిల్ రావాలని ఆ రోజే అంతా కోరుకున్నారు. అయితే ఇదే విషయంపై రీసెంట్ గా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బన్నీ అరెస్టు వార్త వినగానే తనకు మొదటగా ఆయన పిల్లలు గుర్తొచ్చారని జానీ చెప్పారు. తన ముందే సెట్స్‌లో ఆడుకున్న అయాన్, అర్హ లను గుర్తుచేసుకున్నారు.
“మన శత్రువులైనా జైలు ముఖం చూడకూడదు. అలాంటి వార్తలు విన్నప్పుడు ఫస్ట్ ఆలోచనగా బన్నీ పిల్లలు గుర్తొచ్చారు.
అమాయకమైన పిల్లలకు తండ్రిని దూరం చేయడం ఎంత బాధకరమో ఆ రోజే అనుభవించాను” అంటూ జానీ మాస్టర్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు.
ఇప్పుడీ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు జానీ మాటలను నిజమని అంటున్నారు.
అయితే, జానీ మాస్టర్ కూడా ఇటీవలే తనపై వచ్చిన ఆరోపణల కేసులో అరెస్టయ్యి, బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు కెరీర్‌పై మళ్లీ ఫోకస్ చేస్తున్నారు.