తెలంగాణ: రాష్ట్రానికి మరో అంతర్జాతీయ పెట్టుబడి గుడ్‌న్యూస్ వచ్చింది. జపాన్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలో అవకాశాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు.
“తెలంగాణ రైజింగ్” పేరుతో నిర్వహించిన ప్రజెంటేషన్ జపాన్ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంది. దీంతో జపాన్ దిగ్గజ సంస్థలు ఎన్‌టీటీ డేటా, నెయిసా కలిసి రూ.10,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో అత్యాధునిక AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి.
ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోనే అతిపెద్ద 400 మెగావాట్ల సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 25 వేల GPUలతో అత్యాధునిక వేదికను అందించనున్నారు.
అలాగే జపాన్ కు చెందిన తోషిబా సంస్థ తెలంగాణలో రూ.562 కోట్లతో TTDI సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీని సంగారెడ్డి జిల్లాలో నిర్మించనుంది. GIS ప్లాంట్‌లను ఆధునీకరించేందుకు కూడా ప్రణాళికలు రూపొందించారు. ఈ ఒప్పందాలన్నీ టోక్యోలో సీఎం సమక్షంలో ఎంవోయూలుగా కుదిరాయి.
టోక్యో నగర అభివృద్ధి తెలంగాణకు ప్రేరణగా మారిందని రేవంత్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడులతో తెలంగాణను గ్లోబల్ AI హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది.