ఆస్ట్రేలియా: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా తన కెరీర్‌లో 200వ వికెట్‌ను సాధించి భారత క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించాడు.
బుమ్రా కేవలం 44 టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరుకుని, అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలిచాడు.
ఈ రికార్డు గతంలో కపిల్ దేవ్ పేరిట ఉండేది, అయితే కపిల్ 50 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. బుమ్రా ఈ ఫీట్‌ను సాధించడం ద్వారా రవీంద్ర జడేజాతో సమానంగా నిలిచాడు.
అంతేకాక, రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లో ఈ ఘనత సాధించి, ఈ జాబితాలో ముందంజలో ఉన్నాడు. బుమ్రా తన 200వ వికెట్‌గా ట్రావిస్ హెడ్‌ను అవుట్ చేయడం విశేషం.
ఒవరాల్‌గా, అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన రికార్డు పాకిస్థాన్ స్పిన్నర్ యాసిర్ షా పేరిట ఉంది, అతను కేవలం 33 టెస్టుల్లో ఈ ఫీట్‌ను సాధించాడు. బుమ్రా ఈ రికార్డుతో భారత బౌలింగ్ లో ప్రాధాన్యతను మరోసారి చాటాడు.