బాలీవుడ్‌లో జాట్ సునామి.. గోపీచంద్ మాస్ మ్యాజిక్
బాలయ్య, రవితేజలతో సూపర్ హిట్స్ అందుకున్న గోపీచంద్ మలినేని బాలీవుడ్‌కి ‘జాట్’తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 11న విడుదలై, నార్త్ ఇండియాలో మంచి స్పందన పొందుతోంది. మొదట ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చినా, రెండో రోజునుంచి బాక్సాఫీస్ వద్ద స్పీడ్ పెరిగింది.
పంజాబ్, హర్యానా, యూపీ బెల్ట్లలో సన్నీ డియోల్ క్రేజ్ వర్కౌట్ అవుతోంది. లాంగ్ వీకెండ్‌తో కలిపి మొదటి నాలుగు రోజుల్లో రూ.30 కోట్ల వసూళ్లు దాటే ఛాన్స్ కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌కి గోపీచంద్ మాస్ టచ్ పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది.
బాలీవుడ్ ఆడియెన్స్‌కు నచ్చేలా స్నేహితులు, కుటుంబం, ప్రతీకార అంశాలను మిక్స్ చేసిన గోపీచంద్.. మాస్ డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్స్‌తో థియేటర్‌లో పండుగ వాతావరణం సృష్టించారు. రేజీనా కీలక పాత్రలో మెప్పించగా, సయ్యామి ఖేర్ గ్లామర్ అట్రాక్షన్‌గా నిలిచారు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మాస్ టోన్ అందించాయి. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా మంచి రన్ ఇచ్చేలా కనిపిస్తోంది. బాలీవుడ్‌లో తొలి ప్రయత్నంతోనే గోపీచంద్ హిట్ సాధించే దిశగా పయనిస్తున్నారు.
ఇప్పుడు మిగిలిన రోజుల్లో ఈ మాస్ డ్రామా ఎన్ని కోట్లను అందుకుంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.