ఏపీ: టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం గుంతకల్లు నియోజకవర్గంలో బీజేపీ, జనసేన నేతలతో కలిసి పర్యటిస్తున్న సందర్భంలో ఆయన మీడియాపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.
తప్పు ఉంటే తల వంచుతానని చెబుతూనే… అసత్యాలు రాస్తే మాత్రం మీడియా అని కూడా చూడనని ఆయన ఆయా సంస్థల మీడియా ప్రతినిధులను హెచ్చరించారు.
జయరాం వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, గతంలో వైసీపీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చినా ఇంత తీవ్రంగా మీడియాను హెచ్చరించిన దాఖలాలు లేవు.
అధికార పార్టీలో ఉండి ఈ తరహాలో మీడియాను బెదిరించడం అప్రజాస్వామికమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సినియర్ రాజకీయ నేతగా జయరాంకు మాస్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనపై ఒత్తిడిని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై టీడీపీ, కూటమి నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.