తాడిపత్రి: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నేత, సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీ, విమర్శలపాలయ్యారు.
“ప్రాస్టిట్యూట్” అనే పదాన్ని ఉపయోగించి మాధవీలతను అభ్యంతరకరంగా వ్యాఖ్యానించడంతో ఏపీ బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు.
ఈ నేపథ్యంలో జేసీ తన మాటలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు తెలిపారు. ‘‘నోరు జారడం జరిగింది. మాధవీలతకు నొప్పి కలిగిస్తే చింతిస్తున్నాను’’ అని జేసీ వివరణ ఇచ్చారు.
తాడిపత్రిలో మహిళల కోసం నిర్వహించిన వేడుకలను విమర్శించిన మాధవీలత వ్యాఖ్యలతోనే ఈ వివాదం ప్రారంభమైంది.
జేసీ క్షమాపణలు చెప్పినప్పటికీ, బీజేపీ వర్గాలు ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నాయి. జేసీ మాటలు తగవని, మహిళలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.