అనంతపురం: తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రిలో జేసీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో మహిళలతో నృత్యాలు చేయించారని బీజేపీ మహిళా నేతలు మాధవీలత, యామిని శర్మ విమర్శించారు. దీనిపై జేసీ తీవ్రంగా స్పందించారు.
జేసీ మాట్లాడుతూ బీజేపీ నేతలు హిజ్రాలకంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంపై బీజేపీకి ఎందుకు బాధ్యత అని ప్రశ్నించారు.
అదేవిధంగా జేసీ ట్రావెల్స్ బస్సు దహనం వెనుక బీజేపీ నేతలే ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ సీరియస్ అయ్యారు. జేసీ వయసుకు తగినట్లు మాట్లాడాలని సూచించారు.
తాము చక్కగా పాలన సాగిస్తుంటే, తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని అన్నారు. ఈ వివాదం అంతటా తీవ్ర చర్చకు దారితీసింది.