fbpx
Thursday, December 26, 2024
HomeMovie Newsనయనతార చేసిన పాత్రలో జాన్వీ కపూర్

నయనతార చేసిన పాత్రలో జాన్వీ కపూర్

JhanviKapoorIn KolamaavuKokila Remake

బాలీవుడ్: 2018 లో నయనతార ముఖ్య పాత్రలో రూపొంది సూపర్ హిట్ అయిన సినిమా ‘కొలమావు కోకిల‘. తెలుగు లో ‘కో కో కోకిల’ అనే పేరుతో విడుదల అయ్యి ఆకట్టుకుంది. డార్క్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందింది. డ్రగ్స్ స్మగ్గ్లింగ్ నేపధ్యం లో అటు సస్పెన్స్ ని ఇటు కామెడీ గా చాలా అద్భుతంగా హ్యాండిల్ చేసాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమాలో చాలా అమాయకమైన పాత్రలో నటించి నయనతార ఆకట్టుకుందని చెపుకోవచ్చు. ప్రస్తుతం ఈ సినిమాని హిందీ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతుంది.

హిందీ లో ‘గుడ్ లక్ జెర్రీ’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నయనతార పోషించిన పాత్రలో జాన్వీ కపూర్ నటింస్తుంది. తమిళ్ లో నయనతార చేసిన నటనని రీచ్ అవుతుందో లేదో మరి విడుదల వరకు వేచి చూడాలి. పంకజ్ మట్ట ఈ సినిమాకి కథా మార్పులు చేస్తున్నారు. సిద్దార్థ్ సేన్ గుప్తా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈరోజు ఈ సినిమాకి సంబందించిన ఆఫీషియల్ ప్రకటనతో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. హిందీ ప్రేక్షకులు కూడా డార్క్ కామెడీ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular