న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2021 గాను దేశంలో పలు టెలికాం సంస్థల డౌన్‌లోడింగ్, ఆప్‌లోడింగ్ స్పీడ్స్‌ను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా విడుదల చేసింది. మునుపటిలాగే మళ్ళీ రిలయన్స్ జియో డౌన్‌లోడింగ్ స్పీడ్ విషయంలో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
రిలయన్స్ జియో టెలికాం కంపెనీ నూండి అత్యధికంగా 20.9 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ నమోదయింది. ట్రాయ్ 4జీ స్పీడ్ చార్ట్ ప్రకారం, డౌన్‌లోడింగ్ విషయంలో వోడాఫోన్ఐడియా సగటున 14.4 ఎమ్‌బీపీఎస్ వేగాన్ని మరియు ఎయిర్‌టెల్ సగటున 11.9 ఎమ్‌బీపీఎస్ వేగాన్ని సాధించాయి.
కాగా అప్‌లోడింగ్ విషయంలో వోడాఫోన్-ఐడియా 7.2 ఎమ్‌బీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో నిలిచింది. వీఇ తరువాత రిలయన్స్ జియో 6.2 ఎమ్‌బీపీఎస్, భారతీ ఎయిర్‌టెల్ 4.5 ఎమ్‌బీపీఎస్ అప్‌లోడ్ వేగాన్ని నమోదు చేశాయి. వినియోగదారులకు ఇంటర్నెట్ నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేయడంలో రిలయన్స్ జియో ముందంజలో ఉంది. గత నెలలో మూడు టెలికాం ప్రైవేట్ ఆపరేటర్ల 4జీ అప్‌లోడ్ వేగం మెరుగుపడినట్లు ట్రాయ్ వెల్లడించింది.
డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ వేగాన్ని వేగాన్ని ట్రాయ్ తన మైస్పీడ్ అప్లికేషన్ సహాయంతో లెక్క కడుతుంది. ట్రాయ్ విడుదల చేసిన డేటా ప్రకారం, జియో 4జీ నెట్‌వర్క్ వేగం 15 శాతం మేర పెరిగింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వరుసగా 85 శాతం, 60 శాతం మేర డౌన్‌లోడింగ్ స్పీడ్ పెరిగింది.