ముంబై: జియో తాజా ప్రకటనతో ఎయిర్ ఫైబర్ యూజర్లకు మంచి వార్త. జియో ఫ్రీడమ్ ఆఫర్ కింద ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండా కొత్త జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు ప్రకటించింది.
ఈ ఆఫర్ కొత్త యూజర్లకు లాభదాయకం కానుంది. జులై 26 నుంచి ఆగస్టు 15 మధ్య కొత్తగా చేరే వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద కొత్త యూజర్లకు 30% డిస్కౌంట్ అందించబడుతుంది.
జియో ఫ్రీడమ్ ఆఫర్ కింద 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు రూ. 3,121 కేటాయించబడింది. ఇందులో రూ. 1,000 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కలిపి ఉంటాయి, ఇవి మాఫీ అవుతాయి.
కాబట్టి, కొత్త యూజర్లు రూ. 2,121కే జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్ పొందవచ్చు. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే యూజర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవచ్చు.
పరిమిత కాల ఆఫర్ అయినందున, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జియో సూచించింది.