fbpx
Sunday, December 22, 2024
HomeLife Styleజియో యూజర్లకు ఉచితంగా డిస్కవరీ ప్లస్ కంటెంట్

జియో యూజర్లకు ఉచితంగా డిస్కవరీ ప్లస్ కంటెంట్

JIO-OFFERS-DISCOVERY-PLUS-TO-FIBER-CUSTOMERS

న్యూఢిల్లీ: కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్స్ ఇవ్వడంలో రిలయన్స్ ఎప్పుడూ ముందు ఉంటుంది. తాజాగా జియో తన ఫైబర్ వినియోగదారులకు ఒక శుభవార్త తెలిపింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిస్కవరీ ప్లస్ కంటెంట్‌ను జియో తన ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ భాగస్వామ్యం ద్వారా డిస్కవరీ ప్లస్ సైన్స్, అడ్వెంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్ యానిమేషన్ వంటి కంటెంట్‌ను జియో సంస్థ తన ఫైబర్ వినియోగదారులు వీటిన ఉచితంగా ఆస్వాదించవచ్చు. డిస్కవరీ ప్లస్ ప్లాట్‌ఫాం ప్రేక్షకుల కోసం నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను హోస్ట్ చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ యాప్ హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీతో సహా పలు భాషలలో యూజర్లకు కంటెంట్ అందిస్తుంది.

ఈ ఆఫర్ జియో తమ కొత్త, ఇప్పటికే జియో ఫైబర్ వినియోగదారులు రూ.999తో పాటు దాని పై ప్లాన్ ఎంచుకుంటే మాత్రమే ఈ కంటెంట్ ఉచితంగా అందించనుంది. ఈ కొత్త భాగస్వామ్యం వల్ల జియోఫైబర్ కస్టమర్లు రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన ఇంటూ ది వైల్డ్ సిరీస్‌తో సహా ఇతర డిస్కవరీ నెట్‌వర్క్ ప్రీమియం షోలు యాక్సెస్ చేయడానికి అవకాశం లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular