హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ ను రాష్ట్రానికి నూతన డీజీపీగా నియమించింది. ప్రస్తుతం డీజీపీ గా ఉన్న రవిగుప్తాను హోంశాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది.
1992 ఐపీఎస్ బ్యాచ్ కు సంబంధించిన అధికారి అయిన జితేందర్ ఇంతకు ముందు నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, మహబూబ్ నగర్ మరియు గుంటూరు జిల్లాల ఎస్పీగా మరియు విశాఖ రేజ్ డీఐఈగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
తాజాగా ప్రభుత్వం ఆయనను రాష్ట్రానికి డీజీపీ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.