fbpx
Monday, January 20, 2025
HomeBig Storyజాన్సన్ & జాన్సన్ టీకా ప్రయోగం నిలిపివేత

జాన్సన్ & జాన్సన్ టీకా ప్రయోగం నిలిపివేత

JOHNSON-AND-JOHNSON-TRIALS-STOPPED

వాషింగ్టన్‌ : ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ అరికట్టడానికి పలు ఫార్మా కంపెనీలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు కీలక దశకు చేరుకున్నాయి. వ్యాక్సిన్‌ పరీక్షలు ఆశాజనకంగా సాగుతున్న క్రమంలో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే) కీలక ప్రకటన చేసింది. వ్యాక్సిన్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్‌ ప్రయోగించిన వాలంటీర్లలో ఒకరు అస్వస్థతకు గురికావడంతో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.

కంపెనీ నిర్వహించిన అథ్యయన పరీక్షలో పాల్గొన్న ఒక వాలంటీర్ వివరించలేని అస్వస్థతకు గురవడంతో తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌పై మూడవ దశ పరీక్షలు సహా అన్ని క్లినికల్‌ ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో 60,000 మందిని క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ వ్యవస్థను తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు రోగుల భద్రతా కమిటి భేటీ అయి పరిస్థితిని సమీక్షించింది.

ప్రతి క్లినికల్‌ ట్రయల్స్‌లో అయినా ముఖ్యంగా భారీ అథ్యయనాల్లో తీవ్ర ప్రతికూల ఘటనలు ఊహించదగినవేనని జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ పేర్కొంది. అథ్యయనాన్ని నిలిపివేసి ఎస్‌ఏఈకి కారణం ఏమిటనేది పరిశీలించి వ్యాక్సిన్‌ మానవ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా 200 కేంద్రాల్లో 60,000 మంది వాలంటీర్లపై భారీగా మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టేందుకు సెప్టెంబర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వాలంటీర్ల రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular