న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి జాన్సన్ కంపెనీకి భారీ షాక్ తగిలింది. జాన్సన్ యొక్క సింగిల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ డెల్టా వేరియంట్, ఇతర వేరియంట్లపై ప్రభావం చూపడంలేదని తాజా నివేదికలో తేలినట్లు ప్రస్తుతం అమెరికాలో మళ్లీ విస్తరిస్తున్న కేసులకు కూడా ఈ వ్యాక్సిన్ కారణమైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిపింది.
అమెరికాలో అత్యవసర ఆమోదం పొందిన మూడు కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వివిధ వ్యక్తుల నుండి సేకరించిన రక్త నమూనాలపై జరిపిన పరీక్షల ఆధారంగా న్యూయార్క్ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనాన్నినిర్వహించింది. కాగా ఈ సందర్బంగా జాన్సన్ టీకా వేసుకున్న తరువాత వారి నమూనాల ద్వార దీని సమర్థత 29 శాతం మాత్రమే ఉందని పరిశోధనల ఫలితం లో తేల్చారు.
కాబట్టి ఈ నేపథ్యంలొ జాన్సన్ & జాన్సన్ వారి వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు బూస్టర్ డోస్‌లు అవసరం అని అధ్యయనవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా తాజా డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా వారి టీకా సింగిల్ డోస్ యొక్క పనితీరు కేవలం 33 శాతం సమర్ధతతో మరియు రెండవ డోసు తరువాత అది 60 శాతం సమర్ధతతను చూపింది.
ఈ సందర్భంగా శ్వేత సౌధం యొక్క చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ, జాన్సన్ వ్యాక్సిన్ కోసం బూస్టర్ షాట్లు అవసరమా లేదా అనే విషయమై పరిశోధకులు ఇంకా అంచనా వేసే పనిలో ఉన్నారన్నారు. ఇదిలా ఉండగా ఈ వాదనను జే అండ్ జే ప్రతినిధి సీమా కుమార్ తోసి పుచ్చారు. కొత్త వేరియంట్‌లపై తమ టీకా ప్రభావవంతంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.
కాగా తమ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి డోశు కరోనా వైరస్‌పై 66శాతం, రెండు-షాట్ల ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని తేలింది. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ మంగళవారం అందించిన సమాచారం ప్రకారం అమెరికాలో మొత్తం కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ వల్ల నమోదైన కేసులే ఉన్నాయి. కాగా అమెరికాలో 13 మిలియన్లకు పైగా జాన్సన్ టీకాను తీసుకున్నారు.
జాన్సన్ & జాన్సన్ వారి వ్యాక్సిన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం పొందినప్పటి నుండి దాని పనితనంపై అనేక నివేదికలు వెలువడ్డాయి. తీవ్రమైన రక్తం గడ్డకట్టేసమస్యల వివాదంతో ఏప్రిల్‌లో 10 రోజుల విరామాన్ని కూడా ప్రకటించాల్సి వచ్చింది. దాని తరువాత ఈ టీకా తీసుకున్న వారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు జారీ చేసింది.