న్యూఢిల్లీ : బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాల ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు 5జీ టెక్నాలజీ వద్దు అన్న ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. కాగా కోర్టు టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా కోర్టులో ఈ కేసుపై వాదనలు జరుగుతున్న సమయంలో జూహీచావ్లా అభిమాని ఒకరు సినిమా పాటలు వినిపించడం, అలాగే కేసు ప్రొసీడింగ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కారణాం తో కోర్టు ఆమెపై ఆవేశం వ్యక్తం చేసింది. అలాగే జూహి చావ్లాకు 20లక్షల రూపాయల పెనాల్టీ వేసింది.
కోర్టును ఆశ్రయించే ముందు తను ప్రభుత్వానికి ఈ విషయమై ఒక లేఖ రాసి ఉండాల్సిందని కోర్టు అభిప్రాయపడింది. అలాగే పిటిషన్లో బలం లేదని, ఈ పిటీషన్ ను అనవసరంగా దాఖలు చేశారని పేర్కొంది. అయితే 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరుతూ జూహీచావ్లాతో సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.
సుమారుగా 5 వేల పేజీల పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని, ఆమె పిటిషన్‌ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది.