టాలీవుడ్: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమం లో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘RRR ‘ నుండి జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం లుక్ ని విడుదల చేసింది సినిమా టీం. దీనితో పాటు తర్వాత ఎన్టీఆర్ నటించనున్న కొరటాల శివ సినిమా టీం కూడా విషెస్ తెలిపింది. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా ఇన్ని రోజుల నుండి రూమర్స్ గానే ఉన్న మరో రెండు సినిమాల అప్ డేట్ ఈరోజు అఫీషియల్ అయిపోయింది.
కొరటాల శివ తో ఎన్టీఆర్ 30 వ సినిమా రూపొందనుండగా ఆ తర్వాత కే.జి.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో 31 వ సినిమా ఉండనున్నట్టు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ప్రశాంత్ నీల్ కే.జి.ఎఫ్ పార్ట్ 2 ని పూర్తి చేసి ప్రభాస్ తో సలార్ షూటింగ్ పనుల్లో ఉన్నారు. ఎన్టీఆర్ కొరటాల సినిమా మరియు ప్రశాంత్ నీల్ సలార్ ముగియగానే ఈ సినిమా మొదలవనుంది. మైత్రి మూవీ మేకర్స్ మరియు కళ్యాణ్ రామ్ నందమూరి ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మించనున్నాయి.
ఈ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో పని చేయనున్నట్టు చాలానే వార్తలొచ్చాయి. దీనికి అధికారిక ప్రకటన ఏమి రాలేదు కానీ ఈరోజు బుచ్చిబాబు తారక్ కి విషెస్ చెప్తూ ‘వెయిటింగ్ సార్, లోకల్ కథని గ్లోబల్ గా చెప్పి ట్రెండ్ చేద్దాం’ అని ట్వీట్ చేసాడు. నాన్నకి ప్రేమతో నుండే తారక్ కి బుచ్చిబాబు తో రాపో ఉంది. ఉప్పెన సక్సెస్ తో బుచ్చి బాబు కూడా సక్సెస్ఫుల్ సినిమాలు తియ్యగలడని రుజువవడంతో తారక్ ఈ సినిమాని తొందర్లోనే మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమా గురించి మిగతా వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.