టాలీవుడ్: తెలుగులో రూపొందుతున్న ఒక సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఆ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయో. ఆ అంచనాలకి ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని రూపొందిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఈ సినిమా నుండి విడుదలవుతున్న ఒక్కో పోస్టర్ , టీజర్ లే అందుకు సాక్ష్యం. విడుదల చేసిన కొన్ని సెకన్ల టీజర్ లోనే అద్భుతాన్ని చూపించబోతున్నట్టు ప్రెసెంట్ చేసాడు రాజమౌళి. అందుకోసం ఈ సినిమాలో నటిస్తున్న హీరోలు తారక్ మరియు చరణ్ కూడా తమ వంతుగా చాలానే కష్టపడుతున్నారు.
ఈ రోజు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో తారక్ పోస్టర్ ఒకటి విడుదల చేసింది సినిమా టీం. ఈ సినిమాలో జూనియర్ ఎన్ఠీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొత్తం లో రామ్ చరణ్ ని ఫైర్ బ్యాక్ డ్రాప్ లో తారక్ ని వాటర్ బ్యాక్ డ్రాప్ లో వీళ్లిద్దరి కలయిక ని ఫైర్ అండ్ వాటర్ కలయిక గా చూపిస్తున్నారు రాజమౌళి. ఈ పోస్టర్ లో కూడా తారక్ ని వాటర్ బ్యాక్ డ్రాప్ లో చూపించారు.
ఒక బల్లెం పట్టుకుని గాండ్రించే చూపులతో సూటిగా విసురుతున్న తారక్ లుక్ ని ఈ పోస్టర్ లో చూడవచ్చు. గోండ్రు బెబ్బులి అని కొమురం భీం ని పిలుచుకునేవాళ్ళు. ఈ లుక్ లో తారక్ ఆ పదానికి ఏమి తీసిపోనట్టు ఉన్నాడు. అక్టోబర్ లో ఈ సినిమా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు కానీ సెకండ్ వేవ్ కారణంగా మరోసారి షూటింగ్ లకి గ్యాప్ రావడంతో ఆ డేట్ కి కూడా విడుదల అయ్యే అవకాశాలు లేవు.