fbpx
Tuesday, May 6, 2025
HomeMovie Newsఉప్పెన ట్రైలర్: ప్రేమ గొప్పదైతే చరిత్రలోనే ఉండాలి!

ఉప్పెన ట్రైలర్: ప్రేమ గొప్పదైతే చరిత్రలోనే ఉండాలి!

JuniorNtr Released VishnavTejUppenaMovieTrailer

టాలీవుడ్: మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ అనే సినిమాతో పరిచయం అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఏడాది నుండి ఎప్పుడు విడుదల అవుతుందా ఈ సినిమా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12 న విడుదల అవుతుంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ని జూనియర్ ఎన్ఠీఆర్ చేతుల మీదుగా విడుదల చేసారు. ముందుగా ఊహించినట్టుగానే ఈ సినిమా ట్రాజిక్ క్లైమాక్స్ తో రానుందని అర్ధం అవుతుంది.

‘ప్రేమంటే ఒక లైలా – మజ్నులా, ఒక రోమియో- జూలియట్ లా ఉండాలి రా’ అని హీరో డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. హీరో హీరోయిన్ మధ్య మంచి ప్రేమ సన్నివేశాలు కొన్ని చూపిస్తూ విలన్ విజయ్ సేతుపతి ఎంట్రీ చూపిస్తాడు. విజయ్ సేతుపతి రోల్ కొంచెం ముకుంద సినిమాలో రావు రమేష్ పాత్ర కి దగ్గరగా వుంది. పరువు కోసం ఏమైనా చేసే పాత్రలో హీరోయిన్ తండ్రి గా విజయ్ సేతుపతి నటించాడు. సినిమా మొత్తం ఒక ఎగువ మరియు దిగువ కాస్ట్ లేదా అంతస్థు బేధం ఉండే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ, వారికి అడ్డుపడే పరిస్థితులు. ఇలాంటి ఫార్ములా తో ఇదివరకే చాలానే సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఫార్ములా ని ఎవరూ వాడట్లేదు. చాలా రోజుల తర్వాత ఇలాంటి కథతో ఒక సినిమా రాబోతుంది. అది కూడా మెగా ఫామిలీ హీరో లాంచింగ్ సినిమా. మరి సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంటుందా అనేది చూడాలి. ఇదివరకు మరాఠి లో ఇలాంటి కథతోనే ‘సైరాత్’ అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితమైంది. హీరోయిన్ కీర్తి శెట్టి ఈ సినిమా ద్వారా పరిచయం అవనుంది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్ హిట్ గా నిలిచింది. ట్రైలర్ లో మరియు టీజర్ లో వినిపించిన బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించారు. ‘ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’ లాంటి విలన్ డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. సినిమాలో డైలాగ్ లు కూడా ఆకట్టుకున్నాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని వాలంటైన్ వీక్ లో ఫిబ్రవరి 12 న ఈ సినిమా విడుదల అవనుంది.

Uppena Telugu Movie Trailer | Panja Vaisshnav Tej | Krithi Shetty | Vijay Sethupathi | Buchi Babu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular