టాలీవుడ్: తెలుగులో ప్రస్తుతం ఉన్న నటుల్లో ఏ పాత్ర అయినా ఎలాంటి హావభావాలైనా సునాయాసంగా చేయగలగడంతో పాటు అందర్నీ మెప్పించగల నటుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ అని మెజారిటీ వ్యక్తులు చెప్తారు. ఇండస్ట్రీ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటనకి చాలా మంది అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ అంతా యంగ్ టైగర్ అని పిలుచుకునే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ గురించి తెల్సిన విషయమే. రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా చేస్తారు అనే ఉదేశ్యం తో ఎన్టీఆర్ ఫాన్స్ అందర్నీ ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం కరోనా సందర్భంగా అంతటా లాక్ డౌన్ లో ఉంది. కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుని సేఫ్ గా ఉండండి అని పోస్ట్ ద్వారా తెలియచేసారు. ప్రస్తుతం కరోనా కారణంగా క్వారంటైన్ లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కోసం చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు. అవన్నీ చూస్తున్నానని , ‘మీ ఆశీస్సులతో నేను బాగుంటానని, ఇంతటి అదృష్టం కన్నా ఇంకా ఏం కావలి?’ అని పోస్ట్ లో చెప్పారు. ఇది వేడుకలు చేసుకునే సమయం కాదని అందరూ ఇళ్లలోనే ఉంది మీ ఇంట్లో వాళ్ళని, కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించారు. త్వరలోనే మన దేశం మొత్తం కరోనాని ఓడిస్తామని అప్పుడు దేశమంతా వేడుకలు చేసుకుందామని జాగ్రత్తగా ఉండమని ముగించారు.