fbpx
Tuesday, January 7, 2025
HomeMovie Newsఎవరు మీలో కోటీశ్వరులు అంటున్న ఎన్టీఆర్

ఎవరు మీలో కోటీశ్వరులు అంటున్న ఎన్టీఆర్

JuniorNTRtoHost EvaruMeeloKoteeshwarudu Show

హైదరాబాద్: కౌన్ బనేగా కరోడ్ పతి అంటూ అమితాబ్ బచ్చన్ ద్వారా హిందీలో కేబీసీ షో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఆ షో ని చాలా భాషల్లో ఆ భాషల్లో ఉన్న పెద్ద హీరోల ద్వారా చేసారు. తెలుగులో ఇప్పటివరకు అక్కినేని నాగార్జున, మెగా స్టార్ చిరంజీవి ఈ షో కి హోస్ట్ గా నడిపించారు. ఇది వరకు మా టీవీ లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో టెలికాస్ట్ అయిన ఈ షో ఇప్పటినుండి జెమినీ టీవీ లో ప్రసారం అవనుంది. ఈ షో ని ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే పేరుతో ప్రసారం చేయనున్నారు. ఈ షో కి టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్నారు.

ఇదివరకే బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ కి హోస్ట్ గా తర్వాతి సీజన్ హోస్ట్ లకి అందుకోలేని టార్గెట్ ఫిక్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సారి ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ కి హోస్ట్ గా అలరించనున్నాడు. ఈ షో కి సంబందించిన టీజర్ ఈరోజు విడుదలైంది. ఆట నాది కోటి మీది ఈ షో కి వచ్చి డబ్బులతో పాటు మిమ్మల్ని మీరు గెలవండి అంటూ ఎన్టీఆర్ టీజర్ లో ఆకట్టుకున్నాడు. ఈ షో లో ‘మీ రామారావు’ అంటూ ఎన్టీఆర్ తనని సంబోధిస్తూ ఆకట్టుకోబోతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular