సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో, చంద్రచూడ్ తన తర్వాతి సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రతిపాదించారు.
సుప్రీం కోర్టులో ఆయన అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నందున, ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే, జస్టిస్ ఖన్నా 51వ సుప్రీం కోర్టు సీజేగా నియమితులవుతారు.
సుప్రీం కోర్టు సీజేఐ నియామక ప్రక్రియలో సీనియర్ న్యాయమూర్తిని ప్రతిపాదించడం ఆనవాయితీ. ప్రస్తుతం జస్టిస్ ఖన్నా చంద్రచూడ్ తర్వాత ఉన్న సీనియర్ జడ్జ్ కావడంతో, ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేస్తూ చంద్రచూడ్ లేఖ రాశారు.
ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం లభిస్తే, నవంబర్ 12న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీం కోర్టు నూతన సీజేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనకు ఈ పదవి 2025 మే వరకు ఉంది. ఆ తర్వాత పదవీ విరమణ చేయనున్నారు.