fbpx
Sunday, November 24, 2024
HomeNationalజ్యోతిక నాకోసం ఎన్నో త్యాగాలు చేసింది- సూర్య

జ్యోతిక నాకోసం ఎన్నో త్యాగాలు చేసింది- సూర్య

Jyotika has made many sacrifices for me- Surya

జాతీయం: జ్యోతిక నాకోసం ఎన్నో త్యాగాలు చేసింది – సూర్య

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ జంట అయిన సూర్య, జ్యోతిక తమ కుటుంబంతో ముంబయి కి మకాం మార్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సూర్య ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను పంచుకున్నారు. భార్య జ్యోతిక తనకోసం చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. ‘‘జ్యోతిక 18 ఏళ్ల వయసులో చెన్నైకి వచ్చి, నాతో కలిసి జీవితాన్ని ప్రారంభించింది. మా పెళ్లి తర్వాత చెన్నైలోనే ఉన్నాం. నా కుటుంబం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేసింది. తన ముంబయి స్నేహితులను, కెరీర్‌ను వదులుకుని జీవనశైలిలో మార్పులు చేసింది” అని సూర్య అన్నారు.

కోవిడ్ తరువాత మార్పు అవసరం అనిపించింది:
కోవిడ్-19 మహమ్మారి తరువాత తమ కుటుంబానికి కొత్త మార్పు అవసరమని భావించిన సూర్య, అందువల్లే ముంబయికి తరలినట్లు తెలిపారు. ముంబయికి షిఫ్ట్‌ అయిన తర్వాత జ్యోతికకు విభిన్నమైన ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు వస్తున్నాయని, ప్రస్తుతం ఆమె కొత్త దర్శక, నిర్మాతలతో కలిసి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ సవాళ్లను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ‘‘నేను ప్రఖ్యాత దర్శకులతో పనిచేయాలనుకుంటాను. కానీ, జ్యోతిక ఎప్పుడూ కొత్త టాలెంట్‌తో కలిసి పనిచేయాలనుకుంటుంది. ఇటీవల ఆమె నటించిన ‘శ్రీకాంత్‌’, ‘కాదల్‌ – ది కోర్‌’ చిత్రాలు ఈ దిశగా ఆమె ప్రయాణానికి ఉదాహరణ’’ అని అన్నారు.

ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో హిట్‌ జోడీ:
సినిమా పరిశ్రమలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ సూర్య, జ్యోతిక సక్సెస్‌ఫుల్ జంటగా నిలిచారు. తమిళంలో ‘పూవెల్లం కేట్టుప్పార్‌’ మొదలుకొని ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని సమాచారం. ‘బెంగుళూరు డేస్‌’ ఫేమ్‌ అంజలి మేనన్‌ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే నిజమైతే 18 ఏళ్ల తరువాత వీరిద్దరిని స్క్రీన్‌పై చూడటానికి అవకాశం లభిస్తుంది.

ఇక సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘కంగువా’లో నటిస్తున్నారు. నవంబర్‌ 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular