“క” రివ్యూ: కథ: 1977లో జరిగిన హత్య కేసులో వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం)ను విచారించేందుకు సీక్రెట్ ఏజెంట్లు అతడిని రహస్య ప్రదేశానికి తీసుకెళ్తారు. అక్కడే రాధ (తన్వి రామ్)ని కూడా ప్రశ్నిస్తున్న సమయంలో, వారి మధ్య చర్చలు జరుగుతాయి.
ఈ క్రమంలో కృష్ణగిరి అనే గ్రామం, అక్కడ జరిగే అమ్మాయిల మిస్సింగ్ కేసులు, వాసుదేవ్ పాత్రతో కలవడం వంటి ఆసక్తికరమైన అంశాలు క్రమంగా వెలుగులోకి వస్తాయి. ఈ మిస్టరీ ఏమిటి? కృష్ణగిరిలో ఏమి జరుగుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం క చిత్రం.
నటీనటుల ప్రదర్శన: వాసుదేవ్ పాత్రలో కిరణ్ అబ్బవరం తనలోని నటనా ప్రతిభను మరోసారి చూపించాడు. ప్రత్యేకంగా రెండు షేడ్స్‌లో కనిపిస్తూ యాస, వాచకం, బాడీ లాంగ్వేజ్‌లో వేరియేషన్ చూపించడం ఆకట్టుకుంది. తన్వి రామ్ రాధ పాత్రలో న్యాచురల్ గా ఆకట్టుకోగా, నయన్ సారిక తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. బిందు చంద్రమౌళి పాత్రలో బాగా నటించి, తన స్థాయిని పెంచుకుంది. ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం: ఎడిటర్ శ్రీ వరప్రసాద్ సూపర్ కట్స్, టైటింగ్ జూమ్స్ తో ప్రతీ సీన్‌కి ప్రాణం పోశాడు. సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్ తొలి ఫ్రేమ్ నుండి తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సినిమా విజువల్స్‌కు జీవం పోశాడు. సినిమాటోగ్రాఫర్లైన సతీష్ రెడ్డి మాసం, డానియల్ విశ్వాస్ ఎఫెక్టివ్ విజువల్స్ అందించారు, ముఖ్యంగా కోర్టు సీక్వెన్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకుంటాయి.
డైరెక్టర్లు సుజీత్ & సందీప్: “క”ర్మ కాన్సెప్ట్‌ను వినూత్నంగా ప్రెజెంట్ చేయడానికి చేసిన ప్రయత్నం అభినందనీయం. తాము చూపించిన క్రియేటివిటీ థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించారు. అయితే స్క్రీన్‌ప్లేలో కొంత తడబడటం కథను పూర్తిగా అలరించనివ్వలేదు.
విశ్లేషణ: అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ ఉన్నప్పటికీ, కథనం కొద్దిగా బలహీనంగా ఉండటం కొంచెం నిరాశ కలిగిస్తుంది. అయితే క్లైమాక్స్ సీన్ & “క” టైటిల్‌కు ఇచ్చిన జస్టిఫికేషన్ మాత్రం ఆకట్టుకుంటుంది.
రేటింగ్:3/5