హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ విలక్షణ నటుడు అయిన కైకాల సత్యనారాయణ గత నెలలో కిందపడి అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. కాగా ఇప్పుడు ఆయన మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
తీవ్ర అనారోగ్యంతో ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యం విషయమంగా ఉండటంతో వైద్యలు అతన్ని వెంటిలెటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇవాళ అపోలో వైద్యులు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
ఈ రోజు ఉదయం 7.30 గంటలకు ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని, అప్పటి నుండి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని అపోలో వైద్యులు పేర్కొన్నారు. అలాగే కైకాల ఆరోగ్యం మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని అపోలో వైద్యులు తమ ప్రకటనలో తెలిపారు.