మూవీ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని పుకార్లు వస్తున్నాయి. టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార కాజల్ అగర్వాల్. సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న వేళలోనే 2020 సంవత్సరంలో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును తను పెళ్లాడింది.
కాగా ఇటీవలే పండంటి ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల కాజల్‌కు సంబంధించిన ఒక వార్త ఇంటర్నెట్ లో చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. తన కొడుకు కోసం తాను పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందనే సారాంశం ఆ వార్త ద్వారా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాజల్ సినిమాలకు పూర్తిగా దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా ఈ పాటికే చేసుకున్న అగ్రిమెంట్‌ను కూడా రద్దు చేసుకున్నట్లు వినిపిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ నుండి ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.