టాలీవుడ్: అక్కినేని హీరో నాగార్జున ఆచి తూచి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మన్మధుడు 2 , భాయ్, ఆఫీసర్ లాంటి వరుస పరాజయాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని తనని ఎక్సయిట్ చేసే కథలనే ఎంచుకుంటూ వెళ్తున్నాడు. ఆ క్రమంలోనే ‘వైల్డ్ డాగ్’ లాంటి మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో మరో సినిమా తియ్యబోతున్నాడు. ‘చందమామ కథలు’, ‘గరుడ వేగా’ లాంటి సినిమాలు చూస్తే చాలు ప్రవీణ్ సత్తారు ఎలాంటి సినిమాలు తీస్తాడో తెలుస్తుంది.
ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా ఒక ఫుల్ యాక్షన్ డ్రామా జానర్ లో రూపొందుతుంది. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించనున్నారో ఇవాల ప్రకటించారు. ఈ సినిమాలో నాగార్జున తో మొదటిసారి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. దాదాపు సీనియర్ హీరో ల తోనే సినిమాలు చేస్తున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమాకి సంతకం చేసింది. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తుంది. ఏషియన్ వారి శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ బ్యానర్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏషియన్ నారంగ్ మరియు శరత్ మరార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.