fbpx
Monday, November 25, 2024
HomeMovie Newsకల్కి 2: సీక్వెల్ ఎక్కడిదాకా వచ్చిందంటే!

కల్కి 2: సీక్వెల్ ఎక్కడిదాకా వచ్చిందంటే!

KALKI-2-MOVIE-SHOOTING-STATUS-SO-FAR
KALKI-2-MOVIE-SHOOTING-STATUS-SO-FAR

మూవీడెస్క్: కల్కి 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 AD ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

ప్రముఖ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం, ఫ్యాన్స్‌కు అదిరిపోయే అనుభూతిని ఇచ్చింది.

ఇప్పుడు ఈ విజయం తర్వాత కల్కి సీక్వెల్ రాబోతోందని తెలుసుకున్న అభిమానులు మరింత ఆసక్తిగా ఉన్నారు.

నిర్మాత అశ్వనీదత్ ఓ సందర్భంలో సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే మొదలైందని వెల్లడించారు.

అంతేకాక, కొంతమేర షూటింగ్ కూడా పూర్తయ్యిందని చెప్పారు.

తాజాగా గోవాలో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) లో, అశ్వనీదత్ కుమార్తెలైన స్వప్నా, ప్రియాంక కల్కి-2 గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు.

ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ప్రస్తుతం సీక్వెల్‌కు సంబంధించి 35 శాతం షూటింగ్ పూర్తయిందని చెప్పడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది.

దీపికా పదుకొణె ఈ పార్ట్‌లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని చెప్పారు.

మొదటి భాగం షూటింగ్ సమయంలో దీపిక గర్భవతిగా నటించగా, ఇప్పుడు సీక్వెల్‌లో ఆమె మరింత ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనున్నారు.

మొత్తానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న ఫస్ట్ పార్ట్ తర్వాత, సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఫ్యూచర్‌లో కల్కి 2 నుంచి ఇంకెన్ని విశేషాలు వెలువడతాయో వేచి చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular