హైదరాబాద్:జూన్ 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కల్కి 2898 ఏ.డి చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఎందరో పెద్ద పెద్ద నటులు కూడా ప్రముఖ పాత్రలు పోషించారు.
మూవీ కి పాజిటివ్ టాక్ రావడం వల్ల తొలి రోజు నుండే చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనె ఈ చిత్రం 500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, శోభన, రాజేంద్రప్రసాద్ తదితర పెద్ద నటులు ఈ చిత్రంలో నటించారు.
ఇంకా ఈ చిత్రంలో దిగ్గజ దర్శకులైన రాం గోపాల్ వర్మ, ఎస్ ఎస్ రాజమౌలి కూడా అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించారు. మూడు లోకాలు అనే ఒక విభిన్న కథతో పాటు మహాభారత నేపథ్యం కూడా కలిసి ఉన్న ఈ చిత్రం ఇప్పటికే 800 కోట్లు సాధించి, 1000 కోట్ల వైపు పరుగులు తీస్తోంది.
కాగా ఈ చిత్రం విజయం సాధించడంతో తెలుగు చలన చిత్ర స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిందని పలువురు సినీ విశ్లేషకులు పేర్కోంటున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. ఈ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తయిందని చిత్ర నిర్మాత అశ్వనీదత్ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
భారత పురాణ ఇతిహాసమైన మహాభారతం గురించి ఈ చిత్రం లో ప్రస్థావించడం అలాగే అర్జునుడు, అశ్వత్థామ మరియు కర్ణుడు పాత్రల గురించి చూపించడంతో ఇప్పుడు అందరూ మహాభారత పురాణం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఒక శుభపరిణామంగా సనాతన ధర్మ ప్రచారకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.