మూవీడెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ ఈ ఏడాది భారీ సక్సెస్ సాధించింది. ఫ్యూచరిస్టిక్ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా, ప్రభాస్ కెరీర్‌లో బాహుబలి 2 తర్వాత రెండవ హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో పలు ఈవెంట్లలో కల్కి ప్రదర్శించబడగా, ఇప్పుడు 29వ బుసన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా స్క్రీనింగ్ కానుంది.
అక్టోబర్ 8, 9 తేదీల్లో BIFF థియేటర్‌లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ వేడుకకు నాగ్ అశ్విన్ మరియు మూవీ టీమ్ హాజరు కావచ్చు.
ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే కీలక పాత్రల్లో కనిపించడం కూడా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది.
కల్కి 2898ఏడీ మొదటి భాగం విజయం సాధించడంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 2026లో విడుదలకానున్న కల్కి పార్ట్ 2 మరింత భారీగా, 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది.