పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏ.డి బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు క్రాస్ చేసి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ కల్కి-2 మీదే ఉంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా ఫన్నీగా స్పందించారు. సీక్వెల్ ఎప్పుడు వస్తుందంటూ ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన, “కల్కిని మూడు, నాలుగు గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు తీసాను. ఇప్పుడు ఏడు, ఎనిమిది గ్రహాలు వరుసలోకి వచ్చినప్పుడు కల్కి 2 చేస్తా” అంటూ నవ్వులు పుట్టించారు.
అయితే నాగ్ అశ్విన్ ఇటీవల మరో ఇంటర్వ్యూలో, ప్రస్తుతం కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. 2025 చివర్లో షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈసారి ప్రభాస్ పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
అసలు విడుదల తేదీపై క్లారిటీ లేకపోయినా.. నాగ్ అశ్విన్ స్టైల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కల్కి 2 ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.