మూవీడెస్క్: టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ NKR21 కొత్త ప్రాజెక్ట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇటీవల విజయశాంతి, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్ వంటి తారాగణంతో వైజాగ్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.
ప్రధాన తారాగణం అందరూ ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు.
NKR21 మేకర్స్ గతంలో విడుదల చేసిన మేకింగ్ వీడియోలు, స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.
ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ లుక్, విజయశాంతి పోలీస్ అవతారంలో కనిపించడాన్ని ప్రేక్షకులు బాగా స్వాగతించారు.
ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ తో సినిమా మేజర్ టాకీ పార్ట్ పూర్తవుతుందని మేకర్స్ ప్రకటించారు.
15 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలిపారు.
వైజాగ్ షూట్ స్టార్ట్ అయిన సందర్భంగా, సినిమా టీమ్ సెట్స్ నుంచి మేకింగ్ స్టిల్ ను విడుదల చేసింది.
ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కళ్యాణ్ రామ్ లుక్‌ను మెచ్చుకుంటున్నారు.
NKR21లో రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.
అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.