హైదరాబాద్: కరోనా కారణంగా గత మూడు నెలలుగా జన జీవనం స్తంభించింది. ఇప్పుడే మెల్లగా ఒక్కొక్కటి పునః ప్రారంభం అవుతున్నాయి. ఈమధ్యనే గవర్నమెంట్ విధించిన నిబంధనలతో సీరియల్ షూటింగ్స్ ప్రారంభించారు. సినిమా షూటింగ్స్ కూడా ఆ నియమ నిబంధనకు లోబడి ప్రారంభించుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇదే క్రమంలో మెగా హీరో కళ్యాణ్ దేవ్ నటిస్తున్న సూపర్ మచ్చి సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియో లో పునః ప్రారంభం అయింది.
ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా అడపాదడపా తప్ప పెద్దగా షూటింగ్ లు మొదలు అవలేదు. మెగా హీరోల్లో కళ్యాణ్ దేవ్ ఒక్కడే చిత్రీకరణ మొదలుపెట్టాడు. వకీల్ సాబ్ చిత్రీకరణ మొదలు అయినట్టు వార్తలు వస్తున్నా కూడా అధికారికంగా ఏ ప్రకటన లేదు. చిరంజీవి ఈ మధ్యనే ఇప్పుడే ఆచార్య మొదలుపెట్టే అవకాశాలు లేవు అన్నారు. చరణ్ RRR షూటింగ్ లో జాయిన్ అవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. జులైలో అన్నీ చిత్రీకరణలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికి మెగా ఫ్యామిలీ నుండి కళ్యాణ్ దేవ్ మాత్రమే మొదటగా షూటింగ్ కు హాజరు అయ్యాడు. ప్రభుత్వం పెట్టిన కండీషన్స్ కు లోబడే చిత్రంను షూట్ చేస్తున్నట్లుగా సూపర్ మచ్చి యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. యూనిట్ సభ్యుల కోసం పూర్తి స్థాయి భద్రత చర్యలు తీసుకున్న తర్వాతే షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం లో కళ్యాణ్ దేవ్ తో రచిత రామ్ జోడి కడుతున్నారు.