fbpx
Sunday, September 8, 2024
HomeNationalకమల్‌ హాసన్ ఎన్నికల ఎజెండాలో మహిళలకు పెద్దపీట!

కమల్‌ హాసన్ ఎన్నికల ఎజెండాలో మహిళలకు పెద్దపీట!

KAMAL-RELEASES-ELECTION-MANIFESTO

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవటంతో అక్కడ రాజకీయం బాగా వేడెక్కుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మక్కల్‌ నీది మయ్యమ్‌ (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత దక్షిణాది అగ్ర నటుడు కమల్‌ హాసన్‌ బుధవారం తన పార్టీ ఎన్నికల ఎజెండాను ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తమ పార్టీ మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. మహిళల రక్షణ కోసం 181 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే గ్రామీణ బ్యాంక్‌లను మహిళా పథకాల ఆధ్వర్యంలో నిర్వహించేలా కొత్త ప్రతిపాదనలు తీసుకువస్తాని ఎంఎన్‌ఎం పార్టీ ఎన్నికల హామీలను ప్రకటించింది.

బుధవారం రాత్రి ఓ బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని కమల్ హాసన్ ప్రారంభించనున్నారు. కమల్‌ హాసన్‌ ఇటీవల తనకు మద్దతు పలకాలని పలువురు సినీ ప్రముఖులను కలిసిన విషయం కూడా తెలిసిందే. ఆలిండియా సముత్వ మక్కల్‌ కట్చీ పార్టీ అధినేత, నటుడు శరత్‌కుమార్‌తో పాటు ఇందిరా జననయాగ కట్చీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

వారితో కలిసి తాను రాష్ట్రంలో మూడో కూటమిని తయారు చేస్తున్నట్లు కమల్‌ హాసన్‌ ప్రకటించారు. అదే విధంగా ఆ కూటమి సీఎం అభ్యర్థిని తనే అని వెల్లడించారు. ఇక 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్‌ 7వ తేదీన ఒకేదశలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular