fbpx
Friday, October 18, 2024
HomeBig Storyడెమొక్రటిక్ నుండి కమలా హారిస్ కు మద్దతు!

డెమొక్రటిక్ నుండి కమలా హారిస్ కు మద్దతు!

KAMALA-HARRIS-GETS-DEMOCRATIC-PARTY-SUPPORT-FOR-NOMINATION
KAMALA-HARRIS-GETS-DEMOCRATIC-PARTY-SUPPORT-FOR-NOMINATION

న్యూయార్క్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన అధ్యక్ష అభ్యర్థిత్వానికి డెమోక్రాటిక్ పార్టీ మద్దతు పొందామని మంగళవారం ప్రకటించారు. రెండురోజుల క్రితం తిరిగి పోటీ చేయాలనుకున్న జో బైడెన్, వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు.

నేను అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం నా ప్రచారాన్ని ప్రారంభించే ముందు ఈ రోజు మా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అందరి మద్దతు పొందడం నాకు గర్వకారణం.

కాలిఫోర్నియా రాష్ట్రానికి కుమార్తెగా, నా స్వస్థలానికి చెందిన ప్రతినిధుల మద్దతు ద్వార మా ప్రచారాన్ని ముందుకు నడిపించడం పట్ల నేను గర్విస్తున్నాను. త్వరలో అధికారికంగా నామినేషన్ అంగీకరించేందుకు ఎదురుచూస్తున్నాను,” అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో నవంబర్ 5వ తేదీన జరిగే అమెరికా ఎన్నికల్లో రెండవ సారి ఎన్నికకు ప్రయత్నించిన జో బైడెన్, ఆదివారం వెనక్కి తగ్గనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular