లక్నో: కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారించిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన 62 సంవత్సరాల వయసు గల విద్యా శాఖ మంత్రి కమల్ రాణి వరుణ్ ఈ ఉదయం లక్నోలో మరణించారు. కమల్ రాణి దేవి ఈ రోజు అనగా ఆదివారం ఉదయం 9:30 గంటలకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
కమల్ రాణి వరుణ్, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో సాంకేతిక విద్య మంత్రిగా పనిచేశారు. కరోనావైరస్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారింపబడిన ఆమె జూలై 18 న సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరింది.
కేబినెట్ మంత్రి కమలా రాణి వరుణ్ కుటుంబానికి నా ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆమె కోవిడ్-19 సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఒక ప్రజాదరణ పొందిన ప్రజా నాయకురాలు మరియు ఒక సామాజిక కార్యకర్త. ఆమె ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు సమర్థవంతంగా పనిచేశారు, అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సంతాప సందేశంలో తెలిపారు.