కోలీవుడ్: యాక్టింగ్ పరంగా వికీపీడియా లాంటి వాడు కమల్ హాసన్. దాదాపు 60 ఏళ్ళ నుండి అంటే బాల నటుడి స్థాయి నుండి ఆయన చేయని పాత్ర లేదు చూపించని అభినయం లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా సౌత్ లో బాలీవుడ్ లో కమల్ నటనకి అభిమానులు ఉన్నారు. డైరెక్ట్ పాలిటిక్స్ లో పోటీ చేసి ఇపుడు మళ్ళీ సినిమాల్లో బిజీ గా ఉన్నాడు కమల్ హాసన్. ప్రస్తుతం కమల్ హాసన్ ‘విక్రమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
కార్తీ తో ‘ఖైదీ’ సినిమాని రూపొందించి వెంటనే విజయ్ తో ఈ సంవత్సరం విడుదలైన ‘మాస్టర్’ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ లో ముగ్గురు నేషనల్ అవార్డు విన్నింగ్ నటుల్ని చూడవచ్చు. లోకేష్ కనకరాజ్ కాన్సెప్ట్ తో పాటు ఎలేవేషన్స్, మాస్ సీన్స్ తగ్గకుండా చూసుకుంటాడు. అలాంటి డైరెక్టర్ కి ఇలా నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్స్ తోడైతే ఇంక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభించినపుడు ఒక రెండు నిమిషాల టీజర్ విడుదల చేసారు. ఒక్క డైలాగ్ లేకుండా ఒక ఫైట్ ప్రిపరేషన్ సీన్స్ తో బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో విడుదల చేసారు. ఆ రెండు నిమిషాల టీజర్ లోనే టాప్ నాచ్ మ్యూజిక్ ఇచ్చాడు అనిరుద్, ఈ కాంబినేషన్ లో మాస్టర్ తో మ్యాజిక్ చేసిన లోకేష్ మరియు అనిరుద్ మరోసారి హాట్ కాంబినేషన్ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.