టాలీవుడ్: ప్రస్తుతం థియేటర్ లు తెరుచుకున్న తర్వాత ఇన్ని రోజులుగా ఎదురుచూసిన చిన్న సినిమాలు అన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. అందులో రాబోతున్న ఒక సినిమా ‘కనబడుట లేదు’. ఈ సినిమాలో సీనియర్ నటుడు, కమెడియన్ సునీల్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది.
సినిమా ఆరంభం లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ గా సునీల్ ని చూపిస్తారు. ఆ కేసు డీటెయిల్స్ చూస్తుండగా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు.ఆ అమ్మాయి ఇంకో అబ్బాయితో ప్రేమలో ఉంటుంది. ఇంట్లో అమ్మాయి ప్రేమ తెలిసిన పెద్దలు పెళ్ళికి ఒప్పుకోవడం తో తాను ప్రేమించిన అబ్బాయితో లేచిపోవడానికి సిద్ధం అవుతుంది. ఆ టైం నుండి ఆ అబ్బాయి కనపడకుండా పోతాడు. కనపడకుండా పోయిన అబ్బాయి కేసు ని ఇన్వెస్టిగేట్ చేసే అందరూ కనపడకుండా పోతారు. ఈ క్రమం లో నేను కూడా కనపడకుండా పోతానా అని సునీల్ డైలాగ్ ఉంటుంది. ఓవరాల్ గా సినిమా కథ ఏంటి అనేది అవుట్ లైన్ ఇచ్చారు కానీ కథనం ఆకట్టుకునే విధంగా ఉంటే సినిమా హిట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈ సినిమాలో సునీల్ తో పాటు వైశాలి రాజ్, సుక్రాంత్, హిమజ, ప్రవీణ్, యుగ్రమ్, రవి వర్మ, కిరీటి, కంచెరపాలెం కిషోర్ మరిన్ని పాత్రల్లో నటిస్తున్నారు. స్పార్క్ బ్యానర్ పై సాగర్ మంచనూరు, సతీష్ రాజు, దిలీప్ కూరపాటి, శ్రీనివాస్ కిషన్, దేవి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎం బాలరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ సినిమా ఆగష్టు 13 న థియేటర్లలో విడుదల అవనుంది.