ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు మధ్య వివాదం రోజురోజుకి ముదురుతోంది. ముంబై లో మణికర్ణిక సినిమా సందర్భంగా ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకుంది. అయితే అది నిబంధనలకు అనుగుణంగా లేదని ఇదివరకే నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం నిబంధనలకు మీరు ఉన్న కట్టడాలని తొలగించేందుకు మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకొని ఆ ఆఫీస్ బిల్డింగ్ కూల్చుతుండడం తో కంగనా వారిపై మండిపడింది. తన ఆఫీస్ ని రామ మందిరం తో పోలుస్తూ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ను బాబర్ తో పోలుస్తూ బాబర్ రామ మందిరాన్ని కూలుస్తున్నారు అని పోల్చింది. చరిత్ర మళ్ళీ తిరగరాస్తానని కూల్చిన చోటే తన ఆఫీస్ పునర్నిర్మిస్తానని కూడా ట్వీట్ చేసింది.
మహారాష్ట్ర గౌరవం కోసం తాను రక్తం ధారపోయడానికి సిద్ధంగా ఉన్నానని.. తనకు ఆస్తి అతి చిన్న విషయమని.. ఇవేవీ తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించవని పైపెచ్చు పెంచుతాయని మహా ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు కంగనా.’తానెప్పుడూ తప్పు చేయలేదని.. తన శత్రువులు మాత్రం తన మాటలను మళ్ళీ మళ్ళీ నిజం చేస్తున్నారని.. ఇప్పుడు నిజంగా ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్ ని తలపిస్తోందని’ కంగనా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో కంగనా రనౌత్ వీడియో ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను సంభోధిస్తూ తన ఉదేశ్యాన్ని వెళ్లబుచ్చింది. ”ఉద్ధవ్ థాకరే నీవేమనుకుంటున్నావ్?. సినీ మాఫియాతో కలిసి నా ఇళ్లు పడగొట్టి ఆనందపడుతున్నావా?. ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది. రేపు నీ అహంకారం నేలమట్టమవుతుంది. ఇది కాలానుగుణంగా జరిగేదే. గుర్తుంచుకో కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నాకు ఓ విధంగా నీవు మంచే చేశావనిపిస్తోంది. ఎందుకంటే నాకు తెలుసు కశ్మీరీ పండిట్లపై ఏం జరిగిందో. ఇవాళ నాకు అనుభవమైంది. నేను దేశానికి మాట ఇస్తున్నా. నేను అయోధ్యపైనే కాదు కాశ్మీర్ పై కూడా ఓ సినిమా తీస్తాను. నా దేశ ప్రజల్ని చైతన్య పరుస్తాను. ఎందుకంటే నాపై ఏం జరిగినా జరుగుతుంది. దీనివెనుక వేరే కారణాలున్నాయి. వేరే ఉద్దేశ్యాలున్నాయి. ఉద్ధవ్ ధాకరే.. ఈ క్రూరత్వం.. ఈ అరాచకం నా పై జరగడం మంచికే అయింది. జై హింద్. జై మహారాష్ట్ర” అని పేర్కొంది.