మాదాపూర్: పోలీస్ స్టేషన్ పరిధిలో కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన కలిగించింది.
మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాతో మాట్లాడుతూ, ఇది ఆత్మహత్యగా నిర్ధారించామని, మృతదేహం వద్ద లభించిన ఆధారాలు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయని తెలిపారు.
శోభిత మరణానికి ప్రధాన కారణాలు నటనకు దూరం కావడం, అవకాశాలు లేకపోవడం కావచ్చని అనుమానిస్తున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
ఆమె కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, వ్యక్తిగత జీవితంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని వివరించారు.
పోస్టుమార్టం నివేదికలో కూడా అనుమానాస్పద అంశాలేవీ లేవని తెలిపారు. అయితే, మరణానికి ముందు ఆమె డైరీ రాసిందా, లేదా స్నేహితులకు ఏమైనా సందేశాలు పంపిందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
శోభిత ఆత్మహత్యకు గల అసలు కారణాలను మరింత స్పష్టతచేకూర్చేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు వివరించారు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది.