పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న “కన్నప్ప” సినిమాకు సంబంధించిన గ్రాండ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా మూవీ పోస్టర్ లాంచ్ కావడం హిందీ బెల్ట్‌లో హైప్‌ను పెంచింది. జూన్ 27న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ముఖ్యమంత్రి యోగిని కలిసిన చిత్ర బృందంలో మోహన్ బాబు, విష్ణు మంచు, ప్రభుదేవా, నిర్మాత వినయ్ మహేశ్వరి తదితరులు ఉన్నారు. యోగి, సినిమాపై ఆసక్తిగా స్పందించడంతో పాటు భక్తి తత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నానికి అభినందనలు తెలిపారు.
ఈ సినిమాలో మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో ప్రభాస్ పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలవనుందని టాక్. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉండనుంది.
భక్తి, యాక్షన్, అడ్వెంచర్ కలగలిపిన ఈ కథకు పవిత్రత తోడవుతుందని చిత్ర బృందం చెబుతోంది. మోహన్ బాబు నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
జూన్ 27న థియేటర్లలోకి రానున్న “కన్నప్ప” సినిమా, తెలుగు సినిమాకు మరో గుర్తింపు తెచ్చే అవకాశముందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.