మూవీడెస్క్: ప్రస్తుతం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్స్‌లో కన్నప్ప కూడా ఒకటి.
ఈ సినిమాని డిసెంబర్‌లో విడుదల చేయాలని భావిస్తున్న మేకర్స్ హడావుడిగా పనులు పూర్తి చేస్తున్నారు.
అయితే ఊహించని విధంగా అనధికారిక ఫోటోలు లీక్ కావడంతో టీమ్ అప్రమత్తమైంది.
ఈ ప్రాజెక్ట్‌పై ఎనిమిదేళ్లుగా కృషి చేస్తున్నామని, ఇలాంటి లీక్స్ వల్ల 2,000 మంది VFX కళాకారుల కృషి వృథా కాకూడదని భావిస్తున్నట్లు టీమ్ తెలిపింది.
లీక్ అయిన ఫోటోలను ఎవ్వరైనా షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అలాగే, లీక్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తిస్తే 5 లక్షల రూపాయల బహుమతిని అందిస్తామని, పోలీసుల సాయంతో నిందితులను పట్టుకునేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.
24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం అందించారు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అభిమానుల మద్దతు అవసరమని, పాజిటివ్ స్పిరిట్‌ను కాపాడేలా అభిమానులు సహకరించాలని టీమ్ కోరింది.