మూవీడెస్క్: సినిమాపై అంచనాలు ఒక్క పాటతోనే మారిపోతాయని కన్నప్ప నిరూపించింది.
మొదటి నుంచీ ఈ సినిమా మీద ట్రోలింగ్ ఎక్కువగా ఉండగా, తాజాగా విడుదలైన శివ శివ శంకర పాట పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.
రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించగా, విజయ్ ప్రకాష్ తన శక్తివంతమైన గొంతుతో పాటను మరింత భక్తి భావంతో నింపాడు.
ప్రభుదేవా కొరియోగ్రఫీ, స్టీఫెన్ దేవస్సీ సంగీతం ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో కన్నప్ప సినిమాపై నెగటివ్ ట్రోల్స్ తగ్గిపోయి, ప్రేక్షకులలో కొత్త ఆసక్తి పెరిగింది.
మంచు విష్ణు పిక్చరైజేషన్, గ్రాండ్ విజువల్స్, అతని ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ సినిమా మీద ఉన్న అపోహలను తొలగించాయి.
ఈ పాట చూసినవాళ్లకు సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాను మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రత్యేకంగా ప్రభాస్ పాత్ర సినిమాకి మరింత హైప్ తెచ్చేలా ఉంది.
ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న కన్నప్ప ఈ పాటతో మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది.
బాక్సాఫీస్ వద్ద కూడా ఈ ప్రభావం కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.