శాండల్ వుడ్: ఈ జెనరేషన్ కి కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అంటే అల్లు అర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ద్వారా మాత్రమే తెలుసు. కానీ ఒక ఇరవై ఏళ్ల క్రితమే ‘ A ‘, ‘రా’, ‘ఉపేంద్ర’, ‘రక్త కన్నీరు’ లాంటి వైవిధ్యమైన సినిమాల ద్వారా తన పంథా ఏంటని అప్పట్లోనే నిరూపించుకున్నాడు. పైన చెప్పిన సినిమాలు ఏవి కూడా ఇండియన్ సినిమాలో ఇంకో హీరో గాని ఇంకో డైరెక్టర్డై కానీ చేయలేదు , చేయాలి అని కూడా అనుకోరు ఒక వేల అలాంటి ప్రయత్నం చేసినా కూడా అంత పేరు రాదేమో. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాల్లో ఎక్కువ శాతం ఉపేంద్ర డైరెక్ట్ చేసినవే. ఆ తర్వాత కమర్షియల్ బాటలో పడి కొన్ని సినిమాలు ప్రయత్నించాడు, కొన్ని రి-మేక్ చేసాడు కానీ అవేవి ఉపేంద్ర కి పెద్ద సక్సెస్ తీసుకరాలేకపోయాయి.
మళ్ళీ ఇప్పుడు సరిగ్గా అలాంటి కథ, అలాంటి సెటప్ తోనే రాబోతున్నాడు ఈ కన్నడ సూపర్ స్టార్. ‘కబ్జా’ అనే సినిమాతో 1947 లో జరిగిన కథ అనే పీరియాడిక్ మూవీ తో రాబోతున్నాడు ఈ కన్నడ హీరో. చంద్రు దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. 1947 లో ఉన్న అండర్ వరల్డ్ పరిస్థితులని ఆధారంగా చేసుకొని ఒక అండర్ వరల్డ్ డాన్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు అని విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇవాళ సినిమా టీం విడుదల చేసింది. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మాత్రమే కాకుండా ఒరియా, మరాఠి లో కూడా విడుదల చేస్తున్నారు తెలిపారు.