మూవీడెస్క్: రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతార సినిమా కన్నడలో మాత్రమే కాదు, ఇతర భాషల్లో కూడా భారీ కలెక్షన్స్ సాధించింది.
16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, 300 కోట్ల వసూళ్లు సాధించడం విశేషం. ఇప్పుడు ఈ సక్సెస్‌ను మరింత విస్తరించేలా రిషబ్ శెట్టి “కాంతార: చాప్టర్ 1” అనే ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు.
ఈ ప్రీక్వెల్ కోసం మొదట 125 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ, ఇప్పుడు ఆ సంఖ్య 150 కోట్లకు చేరిందని సమాచారం.
కుండపురలో ఒక ముఖ్యమైన ఎపిసోడ్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేయడంతో బడ్జెట్ పెరిగినట్టు తెలుస్తోంది.
రిషబ్ శెట్టి ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్లను ఎంపిక చేసినట్లు టాక్. అంతేకాక, “కాంతార 2″ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
సినిమా పాన్ ఇండియా లెవల్‌లో ఐదు భాషల్లో విడుదల కానుంది. సినిమా హిట్టయితే నటుడిగా దర్శకుడిగా రిషబ్ శెట్టికి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.